ETV Bharat / state

ఉదయగిరి నియోజకవర్గ పరిశీలకుడిపై వేటు.. కొత్తగా ఎవరంటే..! - జగన్ వార్తులు

Jagan changed constituency observer in nellore: రాష్ట్రంలో ఇద్దరు వైసీపీ నేతలపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుడి కొలవలూరు ధనుంజయరెడ్డిని తప్పించగా... విశాఖ పట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గ నేత శరగడం చిన్న అప్పలనాయుడుపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.

YSRCP
YSRCP
author img

By

Published : Feb 7, 2023, 10:52 PM IST

Jagan changed constituency observer: గత కొంత కాలంగా వైసీపీ నేతలు తమ స్వంత పార్టీపైనే విమర్శలు చేస్తున్నారు. పార్టీలో ఆయా నాయకులు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. వారిపై చర్యలకు ఉపక్రమించాలనే అభిప్రాయానికి వచ్చిన వైసీపీ పెద్దలు.. అందుకు తగ్గట్టుగా చర్యలు చేపట్టారు. నెల్లూరు వైసీపీలో ఇప్పటికే ఇద్దరు నేతలపై వేటు వేయగా.. నేడు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ పరిశీలకుడిపై వేటు వేసింది. సీఎం ఆదేశాల మేరకు ఉదయగిరి పరిశీలకుడిగా కొడవలూరు ధనుంజయరెడ్డిని తప్పించగా... విశాఖ పట్నంలోని పెందుర్తి నియోజకవర్గ నేత శరగడం చిన్న అప్పలనాయుడుపై సస్పెన్షన్ వేటు పడింది.

కొలవలూరు ధనుంజయరెడ్డి: రాష్ట్రంలో ఇద్దరు వైసీపీ నేతలపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుడి కొలవలూరు ధనుంజయరెడ్డిపై వేటు వేసిన వైసీపీ.. ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించింది. తన నియోజకవర్గంలో అతిగా వ్యవహరిస్తున్నారంటూ ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి బహిరంగ విమర్శలు చేస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేసిన దృష్ట్యా పరిశీలకుడిపై వేటు వేశారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కొలవలూరు ధనుంజయరెడ్డిని తప్పించిన వైకాపా.. ఆయన స్థానంలో నూతన పరిశీలకుడిగా మెట్టుకూరి ధనుంజయరెడ్డిని నియమించింది.

చిన్న అప్పలనాయుడు: విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గ నేత శరగడం చిన్న అప్పలనాయుడుపై సస్పెన్షన్ వేటు వేశారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైసీపీ నుంచి శరగడం అప్పలనాయుడిని సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులు రావడంతో, వైసీపీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు సస్పెన్షన్ చేస్తూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వైకాపా కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.

ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపణలు: ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి గత కొన్ని రోజులుగా ధనుంజయరెడ్డిపై అసమ్మతి గళం వినిపిస్తున్నారు. పార్టీ పరిశీలకుడు ధనుంజయరెడ్డి తనను ఇబ్బంది పెడుతున్నారని.. దీనిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆయన మండిపడ్డారు. నియోజకవర్గంలో వివాదాలను చేస్తున్నారని ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులను ప్రోత్సహిస్తున్నాడని మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో ధనుంజయరెడ్డిని తప్పించడం వెనుక మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి హస్తం ఉందని నియోజకవర్గంలోని ప్రజలు, నాయకులు అనుకుంటున్నారు.

ఇవీ చదంవడి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.