తెదేపా నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై వైకాపా ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరులో కరోనా పాజిటివ్ కేసు ఆధారంగా ఎన్నికలు వాయిదా వేయాలని కోరామన్న సోమిరెడ్డి వ్యాఖ్యలను కాకాని తప్పుబట్టారు. నెల్లూరులో మాట్లాడిన ఆయన.. ఎన్నికల్లో గెలవలేని ఓ ఈ గ్రేడ్ లీడర్ మాటలకు ఎన్నికల కమిషన్ ప్రభావితం అయ్యిందని విమర్శించారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు వాయిదా వేయవచ్చు కానీ.. అకారణంగా ఎన్నికలు వాయిదా వేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
ఎస్ఈసీని తెదేపా ప్రభావితం చేసింది: కాకాని గోవర్థన్ - స్థానికల ఎన్నికల వాయిదాపై కాకాని గోవర్థన్ కామెంట్స్
ఐదు సార్లు ఎన్నికల్లో ఓడిపోయిన ఓ ఈ గ్రేడ్ లీడర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎన్నికలు వాయిదా వేయటం ఏంటని వైకాపా ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ తెదేపా ప్రభావితం చేసిందని ఆయన ఆరోపించారు.