YSRCP Councillors unhappy about Works : నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో రెండు నెలల తర్వాత చైర్పర్సన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు సమస్యలను ప్రస్తావించారు. మొదట ఆత్మకూరులో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు. అనంతరం స్థానిక 20వ వార్డు వైసీపీ కౌన్సిలర్ సురా భాస్కర్ రెడ్డి స్థానిక వార్డులలో బ్లీచింగ్ గత సంవత్సరంలో చల్లారని.. అప్పటినుంచి ఇప్పటివరకు స్థానిక వార్డుల్లో ఎలాంటి పనులు చేయలేదన్నారు. మున్సిపాలిటీ పరిధిలో నీటిని సప్లై చేసే ట్యాంకులు కూడా శుభ్రం చేయటం లేదని అధికారులను ప్రశ్నించారు. వార్డులో అభివృద్ధి పనుల గురించి ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కరించడం లేదంటూ నిలదీశారు.
మూడో వార్డు టీడీపీ కౌన్సిలర్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి పేదలకు వస్తున్న పెన్షన్ తొలగించడం అన్యాయమని.. వెంటనే వాటిని పరిశీలించి న్యాయం చేయాలని సూచించారు.
ఇవీ చదవండి: