నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని బాలికల వసతి గృహంలో ఏర్పాటు చేస్తున్న క్వారంటైన్ వార్డుకు పడకలు తరలిస్తున్న వాహనాలను స్థానిక మహిళలు అడ్డుకున్నారు. వసతి గృహానికి సమీపంలో నివాసాలు ఉన్నాయని మహిళలు ఆందోళన చేశారు. కరోనా అనుమానితులను ఇక్కడికి తరలిస్తే తమకు సమస్యగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మహిళలకు సర్దిచెప్పడంతో వారు వెళ్లిపోయారు.
ఇదీ చూడండి: