ETV Bharat / state

చెంతనే నీళ్లు ... చేలకు చేరక రైతుల కన్నీళ్లు - nellore district latest news

చేజర్ల, కలువాయి మండలాల్లో సోమశిల, కండలేరు కాలువల మధ్య మిగిలిన 14 వేల ఎకరాల మెట్ట భూములకు నీరందించాలన్న లక్ష్యంతో తలపెట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరో 30 శాతం మాత్రమే పనులు మిగిలి ఉండగా- ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యం ఇవ్వని కారణంగా 2018లో ఆగిన పనులు ఇంత వరకు పునః ప్రారంభం కాలేదు. మరోవైపు కంటికి నీరు కనిపిస్తున్నా.. చేలకు చేరే దారి లేక రైతులు వర్షాధార సాగుతో నష్టాల సేద్యం చేస్తుండటం ఆవేదన కలిగిస్తోంది.

చెంతనే  నీళ్లు ...చేలకు చేరక కన్నీళ్లు ..!

author img

By

Published : Sep 29, 2020, 5:42 PM IST

శ్రీశైలం నుంచి 250 కిలోమీటర్లు ప్రవహించి కండలేరులో కలుస్తున్న నీరు- 200 మీటర్ల దూరంలో ఉండే మెట్ట చేనుకు మాత్రం చేరలేకుంది. కళ్లెదుటే కనిపించే పొలాలకు వాటిని తరలించాలన్న ప్రయత్నానికి పుష్కర కాలం పూర్తయింది. చేజర్ల, కలువాయి మండలాల్లో సోమశిల, కండలేరు కాలువల మధ్య మిగిలిన 14 వేల ఎకరాల మెట్ట భూములకు నీరందించాలన్న లక్ష్యంతో తలపెట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరో 30 శాతం మాత్రమే పనులు మిగిలి ఉండగా- ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యం ఇవ్వని కారణంగా 2018లో ఆగిన పనులు ఇంత వరకు పునః ప్రారంభం కాలేదు. మరోవైపు కంటికి నీరు కనిపిస్తున్నా.. చేలకు చేరే దారి లేక రైతులు వర్షాధార సాగుతో నష్టాల సేద్యం చేస్తుండటం ఆవేదన కలిగిస్తోంది.

చిక్కుముళ్లు

చేసిన పనులకు బిల్లులు అందని కారణంగా కొందరు గుత్తేదారులు చెరువులు, కాలువల పనులు నిలిపివేశారు. దాంతో పనులు అసంపూర్తిగా ఉండిపోయాయి. కాలువలకు, చెరువులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ, రైతులకు బకాయిలు చెల్లించని కారణంగా పనులు చేయలేకపోతున్నామని మరికొందరు చెబుతున్నారు. ఇంకోవైపు కాలువలు, చెరువుల కోసం సేకరించిన భూములకు పరిహారం చెల్లించని కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు.

వర్షపు నీరు వృథా

ఎస్‌ఎస్‌ఎల్‌సీ పథకంలో చెరువుల నిర్మాణం పూర్తికాకపోవడంతో వర్షాకాలంలో వచ్చే నీటని వినియోగించుకునే అవకాశం లేక.. నీరంతా వృథాగా పెన్నానదికి చేరుతోంది. పూర్తయితే రెండు మండలాల్లోని 15 గ్రామాలకు సాగు, తాగునీటి సమస్యలు తీరిపోతాయి. ఎకరానికి రూ. పదివేల నికర ఆదాయం వచ్చినా.. రైతులకు ఏటా రూ. కోట్లలోనే రాబడి వస్తుంది. పండ్ల తోటలు, జీవాలు, పశుపోషణ అవకాశాలు మెరుగవుతాయి.

ఇదీ సంగతి..

పథకం: ఎస్‌ఎస్‌ఎల్‌సీ- ప్యాకేజీ నంబరు-12

ప్రదేశం: సోమశిల- కండలేరు వరద కాలువ దిగువన

నిర్మాణ వ్యయం: రూ. 28కోట్లు

పనులు: నాలుగు చెరువులు, 40 కి.మీ. నిడివి కాలువలు

ఆయకట్టు విస్తీర్ణం: 14వేల ఎకరాలు

ప్రయోజనం పొందే గ్రామాలు: 15 (చవటపల్లి, చినగోపవరం, చిత్తలూరు, వావిలేరు, చేజర్ల కండ్రిక, చీర్లవారికండ్రిక, కండాపురం, వెరుబొట్లపల్లి, నాగులవెల్లటూరు, చింతలాత్మకూరు. తోపుగుంట, కేశమనేనిపల్లి, వెదనపల్లి, కాలాయపాలెం గ్రామాలు)

ప్రస్తుత స్థితి: అన్ని చెరువుల పనులు 70 శాతం పూర్తయ్యాయి. అలుగులు, నీటి విడుదల, రాతి కట్టడాలు, తూముల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది.

నిధులు లేక.. భూసేకరణ జరగక... - శివప్రకాష్‌, జల వనరులశాఖ డీఈఈ

కాలువలకు అవసరమైన భూసేకరణ జరగకపోవడంతో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. గత రెండేళ్లుగా పూర్తయిన పనులకు బిల్లుల చెల్లింపులు జరగని కారణంగా గుత్తేదారులు కాంక్రీట్‌ పనులు ఆపేశారు. ప్రభుత్వం నుంచి నిధులొస్తే పనులు పునః ప్రారంభిస్తాం.

ఎడతెగని నిరీక్షణ

తమ భూములకు నీరొస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న రైతులకు ఏటా నిరాశే మిగులుతోంది. పనులు నత్తనడకన సాగుతుండటంతో పొలాల్లో మెట్ట పైర్లు వేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. చెరువులు ఎండిపోయి.. బోర్లు అడుగంటి.. తోటలు, పైర్లను బతికించుకునేందుకు రూ. వేలు ఖర్చు చేసి బోర్లు వేయిస్తున్నారు. చుక్కనీరు పడని కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు.

ఇదీ చదవండి:

ఆర్డీవో కార్యాలయం వద్ద వీఆర్వోల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.