రంగు మారిన నీటితో ప్రజల ఆరోగ్యం ప్రమాదకరంగా ఉందని.. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు షేక్. షబ్బీర్, హ్యూమన్ రైట్స్ ఎస్సీ ఎస్టీ ఆత్మకూరు కమిటీ ఛైర్ పర్సన్ వాగాల శ్రీహరి ఆందోళన వ్యక్తం చేశారు.
వెంటనే పరిష్కరించాలి..
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణ పరిధిలో గత కొద్ది రోజులుగా తాగునీరు అపరిశుభ్రంగా సరఫరా అవుతుండటం వల్ల పురపాలిక వాటర్ ప్లాంట్‌ను కమిటీ సభ్యులు పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన వాటర్ ప్లాంట్‌కు మరమ్మతులు నిర్వహించి.. తాగునీటి సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ శాఖ అధికారులను కోరారు. వెంటనే ఈ విషయాలను ఆర్డీఓ సహా జిల్లా పాలనాధికారి దృష్టికి సైతం తీసుకెళ్తామని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి…