నెల్లూరు కలెక్టరేట్ వద్ద వీఆర్వోలు ధర్నాకు దిగారు. ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన విధంగా తమకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమానికి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో వీఆర్వోలు తరలివచ్చారు. పదోన్నతుల విషయంలో ఉన్నతాధికారులు వివక్ష చూపుతున్నారని వీఆర్వోల జిల్లా అధ్యక్షుడు అశోక్ కుమార్ రెడ్డి అన్నారు.
గతంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో జీతభత్యాలు చెల్లిస్తుంటే, ఇప్పుడు వాటిని పంచాయతీ కార్యదర్శల వద్దకు మార్చడం దుర్మార్గమన్నారు. బయోమెట్రిక్ విధానంతో ఫీల్డ్ సిబ్బందిగా విధులు నిర్వహించేందుకు ఆటంకం కలుగుతోందని చెప్పారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: