నెల్లూరు జిల్లా సోమశిలలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదుట చుట్టుపక్కన ఉండే పదిహేను గ్రామాల ప్రజలు ఆందోళన నిర్వహించారు. అధికారులు బ్యాంకును మరో చోటుకు తరలించకూడదన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొంచెం నీరు బ్యాంకులోకి రావటాన్ని సాకుగా చూపించి.. వేరే మండలానికి తరలించాలని నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు.
స్థానికంగా ఉండే బస్టాండ్ సెంటర్లో కానీ.. మరొక చోట అయినా బ్యాంకు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకును తరలిస్తే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని తమ బాధను వ్యక్తపరిచారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్రమంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని కలిసి సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం బ్యాంకు మేనేజర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎన్జీవో నాయకుడు బల్లి చంద్రశేఖర్, ప్రాజెక్టు ఉద్యోగులు, రైతులు, ఖాతాదారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: