ETV Bharat / state

విక్రమసింహపురి విద్యార్థులు... సామాజిక సేవలో అగ్రగణ్యులు - ఎన్ ఎస్ ఎస్ లో విక్రమసింహపురికి జాతీయ అవార్డు

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడమే కాదు... వారిని సమాజం పట్ల బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దుతోంది నెల్లూరు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం. జాతీయ సేవా పథకం(ఎన్.ఎస్.ఎస్) ద్వారా విద్యార్థులను సమాజసేవలో భాగస్వాములను చేస్తుంది. ఎన్ఎస్ఎస్​ విద్యార్థులు చేస్తున్న కార్యక్రమాలకు జాతీయపురస్కారం లభించింది.

విక్రమసింహపురి విద్యార్థులు... సేవలో అగ్రగణ్యులు
author img

By

Published : Nov 7, 2019, 12:00 AM IST

Updated : Nov 7, 2019, 11:58 PM IST

విక్రమసింహపురి విద్యార్థులు... సేవలో అగ్రగణ్యులు
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం విద్యార్థులకు మెరుగైన విద్య అందించటంతో పాటు సమాజసేవలోనూ భాగస్వాములను చేస్తోంది. విశ్వవిద్యాలయంలో అమల్లో ఉన్న ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల ద్వారా గ్రామీణులను చైతన్య పరచడం, గ్రామాలను దత్తత తీసుకోని మొక్కలు పెంచడం చేస్తోంది. ఈ సేవా కార్యక్రమాలను విద్యార్థులే ముందుండి నడిపిస్తున్నారు. 2008 నుంచి విశ్వవిద్యాలయంలో... ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు చేస్తున్నామని అధ్యాపకులు తెలిపారు. విద్యార్థులను ఉత్సాహపరుస్తూ... సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా వారికి శిక్షణ ఇస్తున్నారు.

జాతీయ స్థాయిలో గుర్తింపు

2014-15 ఏడాది ఎన్​ఎస్​ఎస్​ సేవా కార్యక్రమానికి.. యూనివర్శిటీకి చెందిన రోహిణి అనే విద్యార్థి జాతీయ ఉత్తమ వాలంటీరుగా ఎంపికై... ఇందిరాగాంధీ అవార్డును అందుకున్నారు. 2016-17కుగాను.. జాతీయ స్థాయిలో ఉత్తమ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామింగ్ అధికారిగా రమేష్ రెడ్డి ఎంపికయ్యారు. 2013-14, 2015-16లోనూ రాష్ట్ర స్థాయి అవార్డులను ఈ విశ్వవిద్యాలయం విద్యార్థులు గెలుచుకున్నారు. గ్రామదర్శిని-గ్రామ వికాసం కార్యక్రమం ద్వారా 2400 మంది విద్యార్థులు 569 బృందాలు ఏర్పడి.. గ్రామాల్లో పర్యటించి గ్రామస్థులకు పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నారు.

గ్రామాల్లో అవగాహన సదస్సులు

విశ్వవిద్యాలయం పరిధిలో 92 కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 110 ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్లలో 11 వేల మంది విద్యార్థులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2367 మంది విద్యార్థులు రక్తదానం శిబిరాల్లో పాల్గొన్నారు. 2018-19లోనూ..విద్యార్థులు 85 వేల మొక్కలు నాటారు. గ్రామాల్లో 234 అవగాహన సదస్సులు, 310 వైద్యశిబిరాలు నిర్వహించారు.

ఇదీ చదవండి:

మేకలతో వానరం దోస్త్​ మేరా దోస్త్​

Intro:Body:Conclusion:
Last Updated : Nov 7, 2019, 11:58 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.