ETV Bharat / state

అధికారుల నిర్లక్ష్యం... దివ్యాంగుల అవస్థలు - Udayagiri the camp is neglected

నెల్లూరు జిల్లా ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో సదరం శిబిరం నిర్వహించారు. శిబిరం నిర్వహణలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహించారు. వైద్య పరీక్షల కోసం వచ్చిన దివ్యాంగులు అవస్థలు పడ్డారు.

Udayagiri the camp is neglected
సదరం శిబిరంలో నిర్లక్ష్యం...అవస్థలు పడ్డ దివ్యాంగులు
author img

By

Published : Jan 13, 2020, 7:14 PM IST

అధికారుల నిర్లక్ష్యం... దివ్యాంగుల అవస్థలు

ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో సదరం శిబిరం నిర్వహించారు. శిబిరం నిర్వహణలో వైద్యశాల సిబ్బంది అలసత్వ ప్రదర్శించారు. ఫలితంగా వైద్య పరీక్షల కోసం వచ్చిన దివ్యాంగులు అవస్థలుపడ్డారు. గతంలో సదరం శిబిరానికి నెల్లూరుకు వెళ్లేవారు. దివ్యాంగుల అభ్యర్థన మేరకు ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో సదరం శిబిరాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

ఆత్మకూరు వైద్యశాల నుంచి ఫిజియోథెరపీ, ఆర్థోపెడిక్ వైద్యులు తిరుమల చైతన్య, చంద్రశేఖర్ వచ్చారు. సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో పరీక్షలకు ఏర్పాటు చేయాలి. మధ్యాహ్నం వరకు చేయలేదు. డేటా ఎంట్రీ ఆపరేటర్ అందుబాటులో లేక వైద్య పరీక్షల కోసం వచ్చిన దివ్యాంగులు అవస్థలుపడ్డారు. సిబ్బంది నిర్లక్ష్యం పట్ల దివ్యాంగుల సహాయకులు అసహనం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదు చేస్తామన్నారు.

ఇదీ చదవండి:

'సికింద్రాబాద్ నుంచి కాకినాడకు ప్రత్యేక రైలు'

Intro:సదరం శిబిరం నిర్వహణలో నిర్లక్ష్యం... అవస్థలు పడ్డ దివ్యాంగులు

Body:ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో సదరం శిబిరం నిర్వహణలో వైద్యశాల సూపరింటెండెంట్, సిబ్బంది చూపిన నిర్లక్ష్యంతో వైద్య పరీక్షల కోసం వచ్చిన దివ్యాంగులు చాలా సమయం పాటు వేచి చూసి అవస్థ పడాల్సిన పరిస్థితి తలెత్తింది. మధ్యాహ్నం వరకు శిబిర నిర్వహణకు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన దివ్యాంగులు ఆవేదన చెందారు. గతంలో సదరం శిబిరం కు వెళ్లాలంటే ఈ ప్రాంత దివ్యాంగులు నెల్లూరుకు పోవాల్సి ఉండేది. ఇటీవల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో సదరం శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆత్మకూరు ఏరియా వైద్యశాల నుంచి ప్రతి సోమవారం వైద్యులు వచ్చి దివ్యాంగులకు పరీక్షలు చేసి ధ్రువపత్రాల మంజూరుకు ప్రతిపాదిస్తున్నారు. అదే క్రమంలో వైద్య పరీక్షల కోసం ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి దివ్యాంగులు సోమవారం ఉదయాన్నే వచ్చారు. ఆత్మకూరు వైద్య వైద్య శాల నుంచి ఫిజియోథెరపీ, ఆర్థోపెడిక్ డాక్టర్ లు తిరుమల చైతన్య, చంద్రశేఖర్ వచ్చారు. సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాల్సి ఉన్నా మధ్యాహ్నం వరకు ఆ వైపుగా చర్యలు చేపట్టలేదు. అలాగే వైద్యులు ప్రతిపాదించిన విధంగా సదరం ధ్రువపత్రం జారీ కి దివ్యాంగుల వివరాలు నమోదు చేసే డేటా ఎంట్రీ ఆపరేటర్ అందుబాటులో లేకుండా పోయాడు. తగిన ఏర్పాట్లు లేక, డేటా ఎంట్రీ ఆపరేటర్ అందుబాటులో లేక వైద్య పరీక్షల కోసం వచ్చిన దివ్యాంగులు నిరీక్షించే లేక అవస్థలు పడాల్సి వచ్చింది. ఆత్మకూరు ఏరియా వైద్యశాల నుంచి వచ్చిన డాక్టర్లు ఏర్పాట్లు తీరుపై సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరిండెంట్ ఠాగూర్ తో నిరుత్సాహం వ్యక్తపరుస్తూ మాట్లాడారు. సమస్యను దివ్యాంగుల వెంట వచ్చిన బంధువులు జిల్లా వైద్యశాల సమన్వయకర్త దృష్టికి తీసుకెళ్లారు. శిబిరం నిర్వహణలో నిర్లక్ష్యం చేసి దివ్యాంగుల ఇబ్బంది పెట్టడం ఏమిటంటూ ఫిర్యాదు చేశారు. శిబిరం సక్రమంగా నిర్వహించకపోతే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. వైద్యశాల సూపరిండెంట్ ఠాగూర్, సిబ్బంది హడావుడిగా అప్పటికప్పుడు ఏర్పాట్లు చేశారు.

Conclusion:రిపోర్టర్ : శ్రీనివాసులు
సెల్ : 8008573944
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.