ETV Bharat / state

డబ్బులివ్వలేదని ఓటింగ్​కు దూరంగా గిరిజన కుటుంబాలు

ఓటింగ్ ప్రక్రియపై ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించినా కొంతమందిలో మార్పు రావడం లేదనడానికి.. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. 17వ వార్డుకు చెందిన 15 గిరిజన కుటుంబాలు.. డబ్బు ఇస్తేనే ఓట్లు వేస్తామని భీష్మించుకుని కూర్చున్నాయి. పక్క వార్డులో ఇచ్చి మాకు ఎందుకు ఇవ్వలేదంటూ వారు ఎదురు ప్రశ్నించారు.

tribals demanding money to cast their votes in atmakuru
ఆత్మకూరులో ఓటు వేసేందుకు డబ్బు డిమాండ్ చేస్తున్న గిరిజనులు
author img

By

Published : Mar 10, 2021, 8:26 PM IST

డబ్బులివ్వలేదని ఓటింగ్​కు దూరంగా గిరిజన కుటుంబాలు

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల్లో విచిత్ర సంఘటన జరిగింది. డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తాము.. లేకపోతే వెయ్యమని కొందరు గిరిజనులు భీష్మించుకుని కూర్చున్నారు. 17వ వార్డుకు చెందిన జమ్మలపాలెంలో 15 కుటుంబాలకు చెందిన ఓటర్లు పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి.. పక్కవార్డులో డబ్బులు ఇచ్చారని తమకు కూడా రూ. 1000 చొప్పున ఇస్తేనే ఓటు వేస్తామని స్పష్టం చేశారు.

ఏ రాజకీయ పార్టీ నాయకులు తమకు డబ్బులు ఇవ్వలేదంటూ పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లి ఓటు వేయకుండా నిరసన తెలిపారు. పక్క వార్డులో ఇచ్చి మాకు మాత్రం ఇవ్వలేదు.. అందరికీ ఒకే న్యాయం ఉండాలి కదా అని అమాయకంగా ఎదురు ప్రశ్నిస్తున్నారు. వీరిని చూసి ఆశ్చర్యపోవడం నేతల వంతైంది.

ఇదీ చదవండి:

సీఐతో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ వాగ్వాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.