అనారోగ్యానికి గురై చికిత్స కోసం ఆసుపత్రికి వెళితే ఇంట్లో దొంగలుపడి దోచేశారు. బీరువాలో రూ.6.5 లక్షల బంగారు నగలు, నగదు కాజేశారు. ఈ ఘటన కోవూరులోని శివాజీనగర్‌లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. బాధిత దంపతుల కుమార్తె ఆకురాతి కల్పన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శివాజీనగర్‌లో నివాసం ఉన్న దంపతులు 25 రోజుల క్రితం అనారోగ్యం కారణంగా ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌లోని బంధువు ఇంటికి వెళ్లారు. శివాజీ నగర్ సమీపంలోనే నివాసం ఉన్న కుమార్తె ఆకురాతి కల్పన ప్రతిరోజు ఇల్లు చూసి వెళ్లేవారు. ఆదివారం ఉదయం వచ్చి చూసేసరికి ఇంటికి వేసిన తాళాలు పగులగొట్టి ఉండడం, బీరువాలో దాచిఉన్న రూ.6.30 లక్షల విలువైన బంగారు నగలు, రూ.20 వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలిని ఎస్సై చింతం కృష్ణారెడ్డి పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: