ETV Bharat / state

Theft: ఓ గదిలో వారు నిద్రిస్తుండగా.. మరో గదిలో సొమ్ము సర్దేశాడు..

author img

By

Published : Apr 16, 2023, 5:51 PM IST

Theft In Kavali: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని చెక్క సురేష్ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. సుమారు కోటి యాభై లక్షల రూపాయల వరకు చోరీ జరిగిందని భాదితులు వాపోతున్నారు. మరో ఘటనలో శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర పట్టణ శివారులో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం సరుకును స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో స్వాధీనం చేసుకుంది.

theft in kavali town nellore district
కావలి పట్టణంలోని బృందావన కాలనీ లో భారీ దొంగతనం

Theft In Kavali : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని చెక్క సురేష్ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. కుటుంబ సభ్యులు ఓ గదిలో నిద్రిస్తున్న సమయంలో దొంగలు ఇంటిలోకి చొరబడి బంగారం, విలువైన వస్తువులు దోచుకున్నారు. సుమారు కోటి యాభై లక్షల రూపాయల వరకు చోరీ జరిగిందని బాధితులు వాపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఒకటో పట్టణ సీఐ, ఎస్ఐలు సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. ఒకటో పట్టణ సీఐ, ఎస్ఐలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ రప్పించి తనిఖీలు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.

భారీగా కర్ణాటక మద్యం పట్టివేత : శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర పట్టణ శివారులో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో పోలీసులు పట్టుకున్నారు. వారికి వచ్చిన సమాచారం మేరకు పట్టణ శివారులో సెబ్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టగా ఆదివారం ఉదయం కర్ణాటక రాష్ట్రం తుంకూర్ నుంచి కర్నూలుకు కారులో అక్రమంగా తరలిస్తున్న దాదాపు 3500 చీప్ లిక్కర్ ప్యాకెట్లను పోలీసులకు పట్టుబడ్డాయి. మద్యంతో పాటు కారుని స్వాధీనం చేసుకొన్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సెబ్ సీఐ భార్గవ్ రెడ్డి తెలిపారు. మద్యం అక్రమ రవాణాకు పాల్పడిన... అక్రమ రవాణాకు సహకరించిన ఎంతటి వ్యక్తులైన ఉపేక్షించే పరిస్థితి లేదని ఈ సందర్భంగా సీఐ భార్గవ్ రెడ్డి తెలియజేశారు.

గుర్తు తెలియని వాహనం ఢీ.. ఒకరు మృతి : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. గిద్దలూరు పట్టణంలో స్థానిక రిజిస్ట్రార్​ కార్యాలయం వద్ద గుర్తు తెలియని వాహనం ఓ వ్యక్తి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి కొమరోలు కు చెందిన నాయబ్ రసూల్ గా గుర్తించారు. సంఘటన స్థాలానికి ఎస్ఐ బ్రహ్మ నాయుడు చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇంజన్​లో పొగలు.. దగ్ధమైన కారు : ఇంజన్​లో పొగలు రావడంతో కారు దగ్ధమైంది. ఈ ఘటన పెద్ద దోర్నాల-శ్రీశైలం ఘాట్​లోని తుమ్మల బైలు సమీపంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పాలకొల్లు నుండి శ్రీశైలం వెళ్తున్న కారు పెద్ద దోర్నాల మండలం తుమ్మల బైలు చెంచు గిరిజన గూడెం సమీపంలో ఒక్క సారి ఇంజన్​లో పొగలు వచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన డ్రైవర్ కారును పక్కకు నిలిపివేశాడు. కారులో ప్రయాణిస్తున్న వారు కిందకు దిగడంతో సురక్షితంగా బయటపడ్డారు. కారు క్షణాలలో పూర్తిగా కాలి దగ్ధం అయిపోయింది. ఈ ప్రమాదంలో ఎవ్వరికి ఎటువంటి ప్రాణ హాని జరగలేదు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.