నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని పాఠశాలలను రానున్న రెండేళ్లలో అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. నగరంలోని ఆర్ఎస్ఆర్ ఉన్నత పాఠశాల భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. నగరంలోని రెండు పాఠశాలలను కార్పొరేటు దీటుగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకు దాతల సహకారం తీసుకుంటామని వెల్లడించారు. దాతలు ముందుకు వచ్చి పాఠశాలల అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని అని ఆయన పిలుపునిచ్చారు.
ఇదీచూడండి.మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత