నెల్లూరు జిల్లా ఉదయగిరి అటవీశాఖ రేంజ్ కార్యాలయానికి ప్రభుత్వం అధునాతన ఆయుధాన్ని మంజూరు చేసినట్లు రేంజ్ అధికారి ఉమామహేశ్వర రెడ్డి తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణా జరగకుండా స్మగ్లర్లను నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, అటవీ శాఖ అన్నివిధాలుగా చర్యలు తీసుకుంటుందన్నారు.
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఎర్రచందనం అక్రమ రవాణాను నివారించేందుకు రేంజ్ కార్యాలయానికి 12 బోర్ పంప్ యాక్షన్ గన్స్‌ను మంజూరు చేశామన్నారు. అడవిలో ఎక్కడైనా ఎర్రచందనం స్మగ్లర్లు అక్రమ రవాణా చేస్తూ తారసపడి ఎదురు దాడికి దిగితే.. ఈ ఆయుధంతో 10 నుంచి 20 మంది స్మగ్లర్లను నిలువరించవచ్చని చెప్పారు.
ఇవీ చదవండి: