TDP Youth Leader Suicide Attempt : నెల్లూరు జిల్లా కావలిలో తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు పైడి హర్ష ఆత్మహత్యాయత్నం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి ఇంటి ఎదుట హర్ష ఆత్మహత్యాయత్నం చేశాడు. వైసీపీ నాయకులు, పోలీసుల వేధింపులే కారణమని ఆరోపణలున్నాయి. హర్ష కడనూతలకు చెందిన ఎస్సీ యువకుడని స్థానికులు తెలిపారు. ఎమ్మెల్యే ఇంటి ముందు అనంతరం ఆర్డీవో కార్యాలయం వద్ద పురుగుల మందు తాగాడు. అతనిని గుర్తించి స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే ఇటీవలే పోలీసులు హర్షపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. టీడీపీ నుంచి వైసీపీలోకి మారలేదనే రౌడీషీట్ తెరిచారనే ఆరోపణలు ఉన్నాయి.
స్పందించిన నారా లోకేశ్ : కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ ఆదేశాలతో.. పోలీసులు పెడుతున్న టార్చర్ భరించలేక హర్ష ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించటం విచారకరమని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. రక్షించాల్సిన ఖాకీలే వేధింపులకు పాల్పడటం దారుణమని మండిపడ్డారు. హర్షకు అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
హర్ష ఆత్మహత్యాయత్నంపై టీడీపీ నేతలు స్పందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడ్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, పోలీసుల వేధింపులే కారణమని టీడీపీ నేతలు ఆరోపించారు. 2019 సంవత్సరంలో వైసీపీ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి హర్షపై వేధింపులు పెరిగాయని తెలిపారు. గతంలో కావలి రూరల్ సిఐగా పనిచేసిన మురళీకృష్ణ ఎమ్మెల్యే ఇంటికి తీసుకు వెళ్లి మరి కాళ్లు పట్టించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఏర్పడిన తర్వాత హర్షపై రౌడీషీట్ ఓపెన్ చేసి.. ఆతనిని మానసికంగా వేధించారని ఆరోపించారు.
ఇవీ చదవండి: