తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా.. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి పర్యటించారు. సైకిల్ తొక్కి ఓటర్లను ఆకటుకున్నారు. మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సీఎం జగన్ అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం చేస్తామన్నారు కానీ.. చేశారా? అని అమర్నాథ్రెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి సొంత బ్రాండ్ల పేరుతో మద్యం అమ్ముతున్నారని ఆరోపించారు. రూ. 60 ఉన్న క్వార్టర్ బాటిల్‌ను రూ. 200కు విక్రయిస్తూ.. ప్రజల రక్తాన్ని తాగుతున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో తెదేపాని గెలిపిస్తే ముఖ్యమంత్రికి నెత్తికెక్కిన కళ్లు దిగివస్తాయన్నారు.
ఇదీ చదవండి: