మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను ఖండిస్తూ... నెల్లూరులో నుడా మాజీ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అన్య మతస్థులు తిరుమలకి వెళితే... డిక్లరేషన్ ఇవ్వాలన్న చంద్రబాబుపై, హిందూ ధర్మంపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సరికాదని హితవు పలికారు. ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ... ఊరుకోబోమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్ కొడాలి నానిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:బూతుల మంత్రికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే.. మేం చేసిన తప్పు !