నెల్లూరు జిల్లా వెంకటగిరిలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం సమావేశం నిర్వహించారు. పార్టీ శ్రేణులకు సమస్యలు ఎదురైతే సంఘటితంగా పోరాడి పరిష్కరించుకోవాలని తెలుగుదేశం పార్టీ నేతలు శ్రేణులకు విశదీకరించారు. నెలకు ఒక మండలంలో పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించడం మంచిదని అభిప్రాయపడ్డారు. రెండునెలల్లో వైకాపా హామీల వైఫల్యాలను ప్రజలకు వివరించి చైతన్య పరచాలని పార్టీ కార్యకర్తలకు జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు రవిచంద్ర, వెంకటగిరి, గూడూరు మాజీ ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, సునీల్ కుమార్ తదితర సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి 'సున్నపురాయి అక్రమ తవ్వకాలపై సమగ్ర నివేదిక సమర్పించండి'