ETV Bharat / state

అస్వస్థతకు గురైన కూలీలకు మెరుగైన వైద్యం అందించాలి: తెదేపా - health condition of migrant workers at kalavai

నెల్లూరు జిల్లా కలువాయిలో అస్వస్థతకు గురైన వలస కూలీలకు మెరుగైన వైద్యం అందించాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. జీజీహెచ్​లో చికిత్స పొందుతున్న కూలీలను మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు.

tdp leaders consulting migrant workers
అస్వస్థతకు గురైన కూలీలకు మెరుగైన వైద్యం అందించాలి
author img

By

Published : Dec 15, 2020, 2:28 AM IST

నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెరుబొట్లపల్లిలో అస్వస్థతకు గురై జీజీహెచ్​లో చికిత్స పొందుతున్న వలస కూలీలను మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పొట్టకూటి కోసం వచ్చిన కూలీలు ఇక్కడ అస్వస్థతకు గురికావడం బాధకరమన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.

మృతుడి కుటుంబానికి రూ. 10లక్షలు, చికిత్స పొందుతున్న వాళ్లకు ఒక్కొక్కరికి రూ. 50వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏలూరులో, నెల్లూరులో జరిగిన ఘటనల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని పత్రిపాటి పుల్లారావు విమర్శించారు. మంత్రులతోపాటు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు అబ్దుల్ అజీజ్, సిటీ నియోజకవర్గ ఇన్ ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

3 రాజధానుల శిబిరానికి ఎలా అనుమతిచ్చారు: హైకోర్టు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.