పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీని తెదేపా వ్యతిరేకించడం లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వైకాపా నాయకులు చేస్తున్న దోపిడికీ తాము వ్యతిరేకమని సోమిరెడ్డి అన్నారు. భూముల రికార్డులు మార్చి వైకాపా నేతలు కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. సీజేఎఫ్ఎస్ భూములకు సంబంధించిన పరిహారం వాటి యజమానులైన ఎస్సీలకే దక్కాలని స్పష్టం చేశారు. స్థలాల పంపిణీ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న రెవెన్యూ అధికారులు, వైకాపా నేతలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆలయల భూములకు పరిహారం చెల్లించి తర్వాత పంపిణీ చేయాలని సోమిరెడ్డి అన్నారు.
ఇదీ చదవండి: అరకు ఆదివాసీల పాటను ఆస్వాదించిన పవన్