ETV Bharat / state

KOTAM REDDY: 'సర్వేపల్లి కాలువ పనుల్లో మంత్రి అనిల్ అవినీతికి పాల్పడుతున్నారు' - నెల్లూరు జిల్లా ముఖ్య వార్తలు

సర్వేపల్లి కాలువ అభివృద్ధిలో మంత్రి అనిల్​కుమార్ అవినీతికి పాల్పడుతున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. మట్టి నమునా పరీక్షలకు 39 లక్షల రూపాయలు కేటాయించడం ఏంటని తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రశ్నించారు.

మాట్లాడుతున్న తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి

author img

By

Published : Jul 6, 2021, 3:17 PM IST

నెల్లూరులో జరుగుతున్న సర్వేపల్లి కాలువ అభివృద్ధి పనుల్లో మంత్రి అనిల్ అవినీతికి పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. 84 కోట్ల రూపాయలతో ఈ పనులు చేపట్టినట్లు ముందు ప్రకటించి.. రివైజ్డ్ టెండర్ పేరుతో మరో 15 కోట్లు మంజూరు చేయించుకున్న విషయం ఎందుకు బయట పెట్టడం లేదని తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రశ్నించారు.

నగరంలోని ఇరిగేషన్ ఎస్ఈని కలిసిన తెదేపా బృందం, సర్వేపల్లి కాలువ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. 15 కోట్లు మంజూరు అయిన విషయం ఎందుకు బయట పెట్టలేదని అధికారులను కోటంరెడ్డి నిలదీశారు. మట్టి నమూనా పరీక్షలకు 39 లక్షల రూపాయలు కేటాయించటం ఏమిటని ప్రశ్నించారు. మంత్రి అనిల్ సహకారంతోనే అవినీతి జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై తాము కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు.

ఇదీ చదవండి:

మిజోరాం గవర్నర్​గా హరిబాబు- దత్తాత్రేయ బదిలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.