135 రోజుల పరుగుల యాత్రలో నెల్లూరు జిల్లా కావలికి చేరిన సుఫియా మీడియాతో మాట్లాడింది. ఆమె తన పరుగుల యాత్రలో నాలుగు మెట్రో సిటీలను చూశానని... దిల్లీ నుంచి ముంబయి మీదుగా చెన్నై వచ్చి... చెన్నై నుంచి కలకత్తా మీదుగా తిరిగి దిల్లీ చేరేలా 6000 కిలోమీటర్లు తన లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. 3 వేల కిలోమీటర్ల లక్ష్యం చేరానని... ఇంకా 3000 కిలోమీటర్లు పూర్తి చేయాల్సి ఉందని చెప్పింది. తనతో పాటు తన టీమ్ కూడా ఉందని.. తన మీద తనకున్న నమ్మకంతో వరల్డ్ బుక్ ఆఫ్ గిన్నిస్ రికార్డును చేజిక్కించుకొనేందుకే ఈ పరుగు పందెం ఎంచుకున్నానంటుంది సుఫియా.
ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికలపై ఒడిశా పిటిషన్.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు