నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బూదవాడకు చెందిన సన్నపురెడ్డి మహేష్ స్థానిక జడ్పీ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. పాఠశాలకు సెలవు ప్రకటించడంతో తన సోదరితో కలిసి ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. మనస్తాపం చెందిన మహేష్ ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వైద్యం నిమిత్తం మహేష్‌ను ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మహేష్ మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఇదీ చదవండి.