నెల్లూరులో రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్, ఆర్.ఎల్. చెస్ అకాడమీల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్నమెంట్ను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ప్రారంభించి కాసేపు క్రీడాకారులతో చెస్ ఆడారు. చెస్ వల్ల మేథా శక్తి పెరుగుతుందని కలెక్టర్ చెప్పారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని చెప్పారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు 13 జిల్లాల నుంచి 150 మందికిపైగా క్రీడాకారులు జిల్లాకు వచ్చారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ పోటీల్లో విజేతకు 51వేల రూపాయల ప్రోత్సాహకం అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండి: ఆలనాపాలనకు నోచుకోని స్వర్ణాల చెరువు