నెల్లూరు జిల్లా ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో దివ్యాంగులకు వైకల్య నిర్ధరణ ధ్రువపత్రాలు పంపిణీ చేసేందుకు సదరం శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆత్మకూరు ఏరియా ఆసుపత్రి నుంచి ఆర్థోపెడిక్, ఫిజియోథెరఫీ వైద్యులు చైతన్య, చంద్రశేఖర్ హాజరయ్యారు. ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ ఠాగూర్ పర్యవేక్షణలో వీరు దివ్యాంగులకు వైకల్య నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. దివ్యాంగులకు ఉన్న వైకల్య శాతాన్ని బట్టి ధ్రువపత్రాల జారీని ప్రతిపాదిస్తామని వైద్యులు తెలిపారు. దివ్యాంగులకు సౌకర్యవంతంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు డాక్టర్ ఠాగూర్ తెలిపారు. సర్టిఫికెట్ల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకున్న దివ్యాంగులు శిబిరానికి హాజరై పరీక్షలు చేయించుకున్నారు.
ఇదీ చదవండి: