ETV Bharat / state

కొవిడ్‌ టీకా రెండో దశ .. తొలిరోజు మొరాయించిన సర్వర్‌

రాష్ట్రంలో రెండో దశ వ్యాక్సినేషన్​లో భాగంగా.. సోమవారం ఒక్కరోజే 60 ఏళ్లకు పైబడిన 1,897 మంది కొవిడ్‌ టీకా వేయించుకున్నారు. తొలి రోజు సర్వర్లు మొరాయించిన కారణంగా... ప్రక్రియ కొంత ఆలస్యమైంది. నెల్లూరు జీజీహెచ్‌లో ఒక్కరికే టీకా వేశారు.

second corona vaccine distribution at andhra pradesh
కొవిడ్‌ టీకా రెండో దశ
author img

By

Published : Mar 2, 2021, 10:17 AM IST

కొవిడ్‌ టీకా రెండో దశ పంపిణీ కార్యక్రమం సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. రాష్ట్రంలో 2,222 ప్రభుత్వ, ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రులకుగాను తొలి రోజు 524 ఆసుపత్రుల్లోనే ఇది ప్రారంభమైంది. కొవిన్‌ వైబ్‌సైట్లో సాంకేతిక సమస్యలు ఏర్పడి సర్వర్‌ మొరాయించింది. ఈ కారణంగా.. చిత్తూరు జిల్లా ఆసుపత్రి, కర్నూలు సర్వజనాసుపత్రి, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రారంభం కాలేదు. విజయవాడలోని జీజీహెచ్‌, మచిలీపట్నం, అనంతపురంలోని జిల్లా ఆసుపత్రుల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకూ సర్వర్‌ మొరాయించడంతో ప్రక్రియ ఆలస్యమైంది.

నెల్లూరు జీజీహెచ్‌లో ఒక్కరికే టీకా వేశారు. గుంటూరు జీజీహెచ్‌, తెనాలి జిల్లా ఆసుపత్రి, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో మధ్యాహ్నం 12 తర్వాత మొదలైంది. టీకా కోసం వచ్చిన వారు నిరీక్షించాల్సి వచ్చింది. మూడో దశ ప్రారంభంకాని చాలా ప్రాంతాల్లో వైద్యారోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు రెండో డోసు వేసే ప్రక్రియ కొనసాగింది. విశాఖపట్నం జిల్లాలో ముందుగా నమోదు చేసుకున్న వారికే టీకా వేశారు. శ్రీకాకుళం, మచిలీపట్నం, జిల్లా ఆసుపత్రుల్లో స్పాట్‌ రిజిస్ట్రేషన్ల ద్వారా వేశారు.

11,614 మందికి కొవిడ్‌ టీకా:

రాష్ట్రంలో సోమవారం 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు మొత్తం 1268 మంది, 60 ఏళ్ల వయస్సు పైబడిన వారిలో 1,897 మంది కొవిడ్‌ టీకా వేయించుకున్నారు. వైద్య ఆరోగ్య, ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులు కలిపి మొత్తం 11,614 మంది మొదటి డోసు టీకా వేయించుకున్నారు. రెండో డోసు టీకాను 3,087 మందికి పంపిణీ చేశారు. దుష్ఫ్రభావం కేసులు ఎక్కడా నమోదు కాలేదు.

ఇదీ చదవండి:

ఉభయతారకంగా నదుల అనుసంధానం: సీఎం జగన్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.