నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం జువ్వలగుంట పల్లె సమీపంలో రోడ్డు ప్రమాదం ఒకరిని బలి తీసుకుంది. జిల్లాలోని హసనాపురం గ్రామానికి చెందిన సానా సురేష్... భార్య పిల్లలతో కలిసి అత్తగారి ఊరు జువ్వలగుంట పల్లికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు.
మార్గ మధ్యంలో.. టమాటాలతో వెళ్తున్న వాహనం వారిని ఢీ కొట్టింది. సురెష్ అక్కడికక్కడే మృతి చెందగా.. మృతుని భార్య పిల్లలు తీవ్రగాయాలపాలయ్యారు. వారిని నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: