ETV Bharat / state

సింహపురి చిన్నోళ్లు... నెట్టింట హల్​చల్!

ఆ ఫైట్ చూస్తే.. ఎన్ని రోజులు తీశారో అనుకుంటారు. ఆ ఎఫెక్ట్స్ చూస్తే.. వామ్మో.. ఎవరో సినీ ఇండస్ట్రీలో నైపుణ్యమున్నవాడే.. ఎడిటింగ్ రూమ్​లో కూర్చున్నాడేమో.. అనిపిస్తుంది. ఆ చిచ్చర పిడుగుల నటన.. స్టార్లకు ఏ మాత్రం తీసిపోదు. రమణా లోడెత్తాలిరా.. అని మహేశ్ బాబు అంటే ఫ్యాన్స్ ఒకటే విజిల్స్.. ఓ బుడ్డోడు అదే డైలాగ్ చెబితే.. సోషల్ మీడియాలో షేర్లే.. షేర్లు.. లైకులే లైకులు.. ఇంతకీ ఆ ఫైట్స్​ తీసింది ఎవరు? ఎక్కడి వారు?

స్లమ్ ఏరియాలో.. సరిలేరు నీకెవ్వరూ
స్లమ్ ఏరియాలో.. సరిలేరు నీకెవ్వరూ
author img

By

Published : Aug 14, 2020, 12:03 AM IST

Updated : Aug 14, 2020, 12:16 AM IST

స్లమ్ ఏరియాలో.. సరిలేరు నీకెవ్వరూ

స్లమ్ ఏరియాలో... సరిలేరు నీకెవ్వరూ.... నైపుణ్యానికి కొదువలేదు..అవకాశాలు లేక ముందుకుసాగని యువత... నెల్లూరు మురుగువాడల్లో యువ ప్రయోగం... అభినందనలు వెల్లువ.... ముగ్గురు యువకులు...రెండు రోజుల్లో చిత్రీకరణ .. అద్భుతం.. సరిలేరు డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రసంశలు... ఆ యువతే నెల్లూరు నగరానికి చెందిన కిరణ్, లాయక్, మున్నా.. వీరికి ఏదైనా కొత్తగా చేయాలనే తపన.. అదే వారికిప్పుడు గుర్తింపునిచ్చింది.

నెల్లూరు నగరంలో శివారు ప్రాంతం భగత్ సింగ్ కాలనీ.. పక్కనే జనార్ధనరెడ్డి కాలనీ. ఈ రెండూ కాలనీలు మురికివాడలే. ఈ కాలనీలకు చెందిన కిరణ్ వయస్సు 19 ఏళ్లు. తొమ్మిదో తరగతితో చదువు ఆపేశాడు. కూలీ పనులకు వెళ్తాడు. లాయక్​ ఇంటర్ పూర్తి చేశాడు. ఈ యువకుడు కూడా దుకాణంలో పనిచేస్తున్నాడు. మున్నా తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వయస్సులో తేడాలు ఉన్నా ముగ్గురూ స్నేహితులు. ఒకేరకమైన ఆలోచనలు. అవకాశాలు వస్తే సినిమాల్లోకి వెళ్లాలనే తపన. షార్ట్ ఫిల్మ్ లు తీస్తున్నారు.

ఈ క్రమంలోనే వీరికి ఓ ఆలోచన వచ్చింది. హీరో మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమాలో యాక్షన్ సిక్వెల్స్​ చిత్రీకరణ చేశారు. మెుదట కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ఫైట్ సీన్ తీశారు. అచ్చుగుద్దినట్లు ఎడిటింగ్ చేశారు. స్లమ్ ఏరియాలో చిన్నపిల్లలతో చిత్రీకరించి.. వారెవ్వా అనిపించుకున్నారు. మరో ఫైట్​.. ఇంకా గొప్పగా చిత్రీకరించారు. రమణా... ఎమ్మెల్యే వచ్చాడురా అనే డైలాగ్ తో మొదలైన సీన్ దింపేశారు. కేవలం సెల్​ఫోన్​తోనే వీడియో తీసి.. ఎడిటింగ్ చేశారు. సరదాగా తీసిన ఈ రెండు ఫైట్లను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు.

ఇక వేలాది మంది నుంచి అభినందనల వెల్లువ. సరిలేరూ.. నీకెవ్వరూ.. సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రత్యేకంగా అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఫైట్ మాష్టర్లు రామ్ ,లక్ష్మణ్ లు నుంచి మెచ్చుకున్నారు. ఈ ఫైట్​లో మహేష్ పాత్రలో నటింటిన మున్నా.. ఇంకా పాఠశాల విద్యార్థే. సీన్​లో ఉన్న పిల్లలంతా.. ఆరు నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్నవారే. వారంతా.. దీని కోసం.. ఒకేరోజు ప్రాక్టిస్ చేశారు. అవకాశాలు వస్తే.. సినిమాల్లోకి వెళ్లాలనేది వారి కోరిక. వారు అనుకున్నది నెరవేరాలని కోరుకుందాం..!

ఇదీ చదవండి:

నిరాడంబరంగా మెగా డాటర్​ నిశ్చితార్థం

Last Updated : Aug 14, 2020, 12:16 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.