నెల్లూరు జిల్లా నుంచి ఈ రోజు సుమారు 140 బస్సులు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచే నెల్లూరు ఆర్టీసీ డిపో నుంచి బస్సులను విజయవాడకు పంపించారు. ఒంగోలు, కావలివైపు బస్సులు నడిచాయి. రెడ్ జోన్లు ఉన్న 3 డిపోల్లో తప్ప మిగతా 13 డిపోల నుంచి బస్సులు తిరిగాయి.
ప్రయాణానికి ముందు.. రసాయనాలతో బస్సులను శుభ్రం చేశారు. భౌతిక దూరం పాటిస్తూ సీట్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క ప్రయాణికుడి చేతుల్లో శానిటైజర్ వేసి శుభ్రం చేసి బస్సుల్లో ఎక్కించారు. డ్రైవర్ల చేతులకు గ్లౌస్ లు కావాలని కోరుతున్నారు. తీవ్రమైన ఎండలు ఉన్నందున మంచినీరు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: