నెల్లూరు జిల్లా ఓజిలి మండలం రాజుపాళెం వద్ద జాతీయ రహదారిపై ఎస్ఈబీ అధికారులు రూ.30 లక్షల విలువైన గుట్కా బస్తాలు తీసుకెళ్తున్న మినీ లారీని పట్టుకున్నారు. కర్ణాటక నుంచి కాకినాడ వెళ్తున్న లారీని తనిఖీ చేయగా.. గుట్కా పట్టుబడింది. ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అక్రమ రవాణా వెనకున్న ముఠా గురించి ఆరా తీస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఈబీ డీఎస్పీలు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు హెచ్చరించారు.
ఇదీ చదవండి: నిడిముసలిలో ఎన్నికల అధికారుల నిర్బంధం