నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల జలాశయ పరిధిలో రెండు నెలల పాటు చేపల వేటను నిషేధించారు. మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లరాదని ఎస్ఐ మహబు సుభాని తెలిపారు. నిబంధనలను అతిక్రమించి చేపల వేట కొనసాగిస్తే.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. అగస్టు 30 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి