నెల్లూరు జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. కోతలకు సిద్ధమైన వరి పంట వాలిపోగా, కోతలు కోసి కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయి రైతులకు కన్నీరు మిగిలింది. వేరుశెనగ పంట కూడా తీవ్రంగా దెబ్బతింది. అకాల వర్షంతో రూ.42.58లక్షల పంటనష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ ఏడీఏ నర్సోజీరావు సోమవారం తెలిపారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ, రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో పంట నష్టం లెక్కగట్టారు. ప్రాథమిక అంచనాలు వేసిన అనంతరం చివరిగా క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి పరిశీలన చేసి నివేదికను తయారు చేశారు. వరి, వేరుశెనగ, కొద్దిమేర నువ్వుల పంట ఎంత మేర ఎంత మేర నష్టం జరిగింది.. ఎందరు రైతులు నష్టపోయారు వంటి లెక్కల నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు ఏడీఏ వివరించారు. వరి, వేరుశెనగ, నువ్వుల పంటలకు సంబంధించి నష్టం తేలగా ఉద్యాన పంటలకు సంబంధించి క్షేత్రస్థాయిలో లెక్కలు కట్టే పనిలో సంబంధిత శాఖాధికారులు సిబ్బంది నిమగ్నమయ్యారు.
ఇదీ చదవండి: