నెల్లూరు సంజయ్‌గాంధీ నగర్లో నివాసముంటున్న ఓ వృద్ధురాలి స్థలంపై (land).. ఓ రాజకీయ నేత (political leader) కన్నేశాడు. వృద్ధురాలిపై తన అనుచరులతో దాడి చేయించాడు. ఆమె ఇంట్లోకి ప్రవేశించి అందరినీ బెదిరించి భయభ్రాంతులకు గురి చేశాడు. ఇదేమని ప్రశ్నించిన స్థానికులను సైతం బెదిరించాడు.
ఈ ఘటనతో భయాందోళనకు గురైన బాధితురాలు.. అత్యంత విలువైన తన స్థలాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకే ఈ దాడులకు పాల్పడ్డారని నేతలు వాపోయారు. ఈ ఘటనపై కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా... పోలీసులు మాత్రం కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.
ఇదీ చదవండి:
SOMU VEERRAJU: 'ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయండి'