ETV Bharat / state

పేకాట స్థావరంపై దాడి... 25 మంది అరెస్ట్ - నెల్లూరు జిల్లాలో 25 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్

పేకాట స్థావరంపై దాడి చేసి.. 25 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో జరిగింది. వీరి నుంచి 4 కార్లు, 11 మోటార్ సైకిళ్లు, 18 చరవాణులు, 45వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Police raided a poker site and arrested 25 people in nellore district
పేకాట స్థావరంపై దాడి
author img

By

Published : Nov 25, 2020, 9:32 AM IST

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. గ్రామనత్తం సమీపంలో పేకాట ఆడుతున్న 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నాలుగు కార్లు, 11 మోటార్ సైకిళ్లు, 18 సెల్ ఫోన్​లు, 45వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

నెల్లూరు జిల్లాతోపాటు ఒంగోలు, శ్రీకాళహస్తి ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి పేకాట ఆడుతున్నట్లు కొడవలూరు ఎస్.ఐ. జిలానీ బాషా తెలిపారు. గేమింగ్ యాక్టు కింద కేసు నమోదు చేసి, పేకాటరాయుళ్లను కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

నాటుసారా, గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.