ETV Bharat / state

అలాంటి పనులు మా కుటుంబంలో లేవు: సోమిరెడ్డి

తెదేపా నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయనపై నమోదైన ఓ కేసుకు సంబంధించి వివరణ ఇవ్వాలని కోరారు. పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని సోమిరెడ్డి తెలిపారు.

సోమిరెడ్డి
author img

By

Published : Sep 6, 2019, 9:06 PM IST

Updated : Sep 7, 2019, 1:33 AM IST

మీడియాతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇడిమేపల్లి భూమికి సంబంధించిన వివరాలు, పూర్తి డాక్యుమెంట్లు సమర్పించాలని వెంకటాచలం పోలీసులు కోరారు. నోటీసును స్వీకరించిన సోమిరెడ్డి భూమికి సంబంధించి 1933 సంవత్సరం నుంచి పూర్తి వివరాలు అందజేస్తామని పోలీసులకు తెలిపారు. ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, ఇప్పటివరకు అలాంటి పనులు తమ కుటుంబంలో లేవని అన్నారు. మొదట విదేశాల్లో వెయ్యి కోట్లు ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు చేశారని... చివరకు ఇడిమేపల్లిలో రెండుఎకరాలకు దిగారని ఎద్దేవా చేశారు. తనపై కేసులు వేసిన వారు పశ్చాత్తాప పడక తప్పదని పేర్కొన్నారు.

ఇడిమేపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 2.40 ఎకరాల తన భూమిపై ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి మరొకరికి రిజిస్ట్రేషన్ చేశారని 2017 ఏప్రిల్ 6న వేలూరు రంగారెడ్డి అనే వ్యక్తి మాజీమంత్రి సోమిరెడ్డిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం అదేశాల మేరకు మాజీ మంత్రి సోమిరెడ్డిపై గత నెలలో కేసు నమోదైంది.

Intro:AP_SKLM_23_06_CM_JAGAN_iiit_pilan_prambam_av_AP10139

త్రిపుల్ ఐటీ భవనాలను ప్రారంభించిన సీఎం

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల మండలంలో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో రూ.28 కోట్లతో నూతనంగా నిర్మించిన భవనాలను సీఎం జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. తొలుత ప్రాంగణంలో మొక్కలు నాటి త్రిపుల్ ఐటీ పైలాన్ను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులతో ఏర్పాటుచేసిన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు. ప్రతి త్రిపుల్ ఐటీ విశ్వవిద్యాలయాలు ప్రతి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు జాబ్ ఓరియెంటెడ్ కోర్సులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు 100% ఫీజు రియంబర్స్మెంట్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతోపాటు డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులకు కూడా మెస్, వసతి సౌకర్యానికి ఏడాదికి రూ.20 వేల చొప్పున అందిస్తా మన్నారు. ప్రతి విద్యార్థి చదువు కోవడానికి ప్రతి ఏడాది రూ. 15000 అందిస్తామని తెలిపారు.

Body:సీఎం జగన్

Conclusion:సీఎం జగన్
Last Updated : Sep 7, 2019, 1:33 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.