నెల్లూరు జిల్లా నాయుడుపేట పోలీసులు చోరీ కేసులో.. నిందితుడైన ఓ యువకుడుని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. పట్టణంలోని దర్గా వీధిలో నివాసం ఉంటున్న శేషారెడ్డి అనే వ్యక్తి నివాసంలో ఎవరూ లేని సమయంలో సదరు యువకుడు పలు మార్లు చోరీ చేశాడు. ఇంటి యజమానికి యువకుడు దగ్గర బంధువు కావడంతో లాకర్లో దాచిన బంగారు ఆభరణాలను మారు తాళాలతో దొంగలించాడు. చోరీ జరిగిన తరువాత యువకుడు పరారీలో ఉన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడిని గాలించి కోర్టులో హాజరుపరిచినట్లు గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: