నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో పందుల నిర్మూలనకు అధికారులు చర్యలు తీసుకుంటుంటే... వాటి పెంపకందారుల నుంచి ప్రతిఘటన ఎదురౌతోంది. నగరంలోని రామకోటయ్య నగర్ లో వరాహాలను పట్టేందుకు ప్రయత్నించిన వారిపై... పందుల పెంపకందారులు రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పందులు పట్టేందుకు వచ్చిన ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు... పందుల యజమానులను అదుపులోకి తీసుకున్నారు.
ఎన్నిసార్లు నోటీసులిచ్చినా పందుల పెంపకందారులు పట్టించుకోవడంలేదని కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ తెలిపారు. వరాహాలను పట్టుకున్నేందుకు వచ్చిన వారిపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. పందులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు గడువు ఇచ్చినప్పటికీ... యధాస్థితిగా అక్కడే ఉంచడం పై ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం కోసం పందుల నిర్మూలనకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలీస్ బందోబస్తు మధ్య పందుల పట్టివేత ప్రక్రియను పూర్తి చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: ఆగని అన్నదాత ఆందోళన- చట్టాల రద్దే ధ్యేయం