శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట రహదారిపై వాటంబేడు గ్రామస్థులు ధర్నా చేశారు. నిన్న కాళంగి నదిలో యువకుడి మృతదేహం లభ్యమైన విషయమై ఆందోళనకు దిగారు. కాలనీ వాసులే యువకుడిని హత్య చేశారని రోడ్డు మీద బైఠాయించారు.
పొలీసులు అక్కడికి చేరుకుని సర్దుబాటు చేసే ప్రయత్నాలు చేశారు. కాలనీ వాసులు అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: