నెల్లూరులో పెన్నా నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సోమశిల జలాశయానికి భారీగా వరద ప్రవాహం చేరుతోంది. ఇప్పటికే జలాశయం పూర్తి స్థాయిలో నిండినందున వచ్చిన వరదను వచ్చినట్లు అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.
దీంతో పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పెన్నా వారధి వద్ద దాదాపు లక్ష యాభై వేల క్యూసెక్కులకు పైగా నీరు ప్రవహిస్తోంది. వరద ప్రవాహం మరో 4 రోజులు కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. పరవళ్లు తొక్కుతున్న పెన్నా ప్రవాహాన్ని తిలకించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్నారు. అయితే వరద ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి.
ఇవీ చదవండి..