నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోన ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఉత్సవాలను నిరాడంబరంగా కానిస్తున్నారు. అర్చకుల ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ వర్గాలు పరిమిత సంఖ్యలో హాజరవుతున్నారు. ఐదవ రోజు వేడుకల్లో భాగంగా నేడు లక్ష్మీ నరసింహ స్వామి వారి ఉత్సవ మూర్తులకు కళ్యాణోత్సవం జరగనుంది.
నెల్లూరు, కడప జిల్లాల్లో ప్రసిద్ధి గాంచిన పెంచలకోన దేవస్థానంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా.. నిరాడంబరంగా నిర్వహించామని అధికారులు తెలిపారు. ప్రతి ఏటా వారం రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు వేలాది భక్తజనం తరలి వచ్చేవారన్నారు.
ఇదీ చదవండి: