ETV Bharat / state

అర చేతిలో పాఠాలు.. అరల్లో పుస్తకాలు!

అర చేతిలో సెల్‌ఫోన్లలో పాఠాలు చూడాల్సి వస్తోంది. ఆన్‌లైన్‌లోనే తరగతులు వినాల్సిన పరిస్థితి. పాఠశాలలు తెరిచేందుకు కరోనా ప్రధాన అడ్డంకిగా ఉండగా, విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడిచిపోతున్నా విద్యార్థులు ఇప్పటికీ బడులకు వెళ్లలేకపోతున్నారు. ఆ క్రమంలో వారు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఇంకోవైపు పాఠశాలలకు చేరిన పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు ఉపయోగపడకపోవడం మరింత ఇబ్బందిగా మారింది.

Online lessons are books in the classroom
ఆన్ లైన్ లోనే పాఠాలు తరగతి గదిలోనే పుస్తకాలు
author img

By

Published : Oct 1, 2020, 1:29 PM IST

ఇప్పటి వరకు పాఠశాలలు ప్రారంభం కాకపోయినా.. విద్యాశాఖ వర్గాలు మాత్రం అవసరాలను దృష్టిలో ఉంచుకుని చాలా రోజులు కసరత్తు చేస్తున్నారు. పాఠ్యపుస్తకాలను ముద్రించి మండలాలకు చేర్చగా, ప్రస్తుతానికి అవి పాఠశాలల వరకు చేరాయి. కొన్ని చోట్ల గత ఏడాది హాజరును దృష్టిలో ఉంచుకుని పంపిణీ చేస్తుండగా- ఎక్కువ ప్రాంతాల్లో ఆ దిశగా అడుగులు లేవు. ఫలితంగా పుస్తకాలన్నీ గదులకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా పాఠ్యాంశాల బోధన జరుగుతోంది. సెల్‌ఫోన్లు, ట్యాబ్‌ల ద్వారా వీక్షిస్తూ అభ్యాసం సాగిస్తున్నారు. ఇలాంటి స్థితిలో పుస్తకాలు వారి చేతిలో ఉంటే ‘ఆన్‌లైన్‌’ బోధనలో ప్రస్తావించిన అంశాలను సరిచూసుకోవడానికి అనువుగా ఉంటుందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. తద్వారా సందేహాల నివృత్తి కూడా సులువు అవుతుందని చెబుతున్నారు. పంపిణీ దిశగా చొరవ చూపాలని వేడుకుంటున్నారు.

ముఖ్యమంత్రి ప్రకటనతో..

అక్టోబరు అయిదో తేదీన పాఠశాలలు తెరవాలని గతంలో నిర్ణయించినా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నవంబరు రెండో తేదీకి ఆ కార్యక్రమం వాయిదా వేశారు. అయినప్పటికీ విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అక్టోబరు 5న జగనన్న విద్యా కానుక అందించేందుకు సిద్ధమయ్యారు. ఆ మేరకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టత ఇచ్చారు. అందులో పాఠ్యపుస్తకాలు కూడా ఇవ్వాలని ప్రస్తావించినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నా.. ఇంకా తమకు ఉత్తర్వులు అందలేదని స్పష్టం చేస్తున్నారు. వాస్త్తవానికి, పాఠ్యపుస్తకాలు 1 నుంచి పదో తరగతి వరకు ఇవ్వాల్సి ఉంది. రాత పుస్తకాలను 6-10 వరకు అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం జిల్లాకు పాఠ్యపుస్తకాలు సరిపడా సరఫరా కాగా, రాత పుస్తకాలు రావాల్సి ఉంది. ఈ స్థితిలో పంపిణీ ఎలా ఉంటుందన్న దానిపై చర్చ నడుస్తోంది.

గదికే పరిమితమైన పాఠ్యపుస్తకాలు​​​​​​​

పుస్తకాలిస్తే మేలు - సుహాసిని, విద్యార్థి తల్లి

కరోనా పరిస్థితుల్లో విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా పాఠ్యాంశాల బోధన జరుగుతోంది. అలా కొంతమేర నేర్చుకుంటున్నారు. పాఠ్య పుస్తకాలు కూడా వారి చేతిలో ఉంటే ఆన్‌లైన్‌లో చూస్తూ, పుస్తకంలో పరిశీలించి అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఆ దిశగా అధికారులు చొరవ చూపితే ఎంతో ఉపయోగకరం.

ఎంతో అవసరం - మనోజ్‌, పదో తరగతి విద్యార్థి

ఆన్‌లైన్‌లో పాఠాలు విన్నా పాఠ్య పుస్తకాలు చేతిలో ఉంటే మరింత ఉపయోగకరం. అవి లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడుతున్నాం. సందేహాల నివృత్తి సమస్యగా మారింది. పంపిణీ చేస్తే మాకెంతో మేలు.

‘కానుక’తో అందిస్తాం - రమేష్‌, జిల్లా విద్యాశాఖాధికారి, నెల్లూరు

జిల్లాలో పాఠ్య పుస్తకాలు పాఠశాలలకు చేరాయి. వాటిని విద్యార్థులకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అక్టోబర్‌ 5న జగనన్న విద్యా కానుక కిట్‌ అందించాలని ఆదేశాలు అందాయి. అదే సమయంలో పాఠ్య, నోటు పుస్తకాలు అందిస్తాం. ఆ మేరకు ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.

Conclusion:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.