నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన ఎస్. మునికుమారి అనే మహిళ వినూత్నంగా తన శివభక్తిని చాటారు. మూడేళ్లలో ఏకంగా కోటి వొత్తులు తయారుచేశారు. కార్తిక మాసంలో కోటి వత్తులు వెలిగించాలని మూడేళ్ల క్రితం సంకల్పించారు. అప్పటి నుంచి ఇంట్లో పనులు ముగియగానే వొత్తుల తయారీకి ఉపక్రమించేదానిని అని తెలిపారు. సోమవారం సాయంత్రం పట్టణంలోని శ్రీకాశీవిశ్వేర స్వామి ఆలయంలో 200 పెద్ద ప్రమిదల్లో వీటిని ఉంచి హారతి ఇస్తామని ఆమె తెలిపారు.
ఇదీ చదవండి: