ముఖ్యమంత్రి జగన్ కరోనా వైరస్ కంటే ప్రమాదకరమని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైకాపా అరాచకాలు సృష్టిస్తోందని తెదేపా నేత, నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విమర్శించారు. నెల్లూరులో అధికారుల ముందే నామినేషన్ పత్రాలు చించేస్తుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కోరారు.
ఇవీ చూడండి...