ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు నెల్లూరు జిల్లా నాయుడపేటలో తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. వారం రోజులుగా తాగునీరు రావడం లేదని మహిళలు ఆరోపిస్తున్నారు. సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. పురపాలక సంఘం ఉప ఖజనా కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసన చేశారు. అధికారుల హామీ మేరకు ఆందోళన విరమించారు.ఇవీ చదవండి...విత్తనాల కోసం రైతుల బారులు