నెల్లూరు జిల్లా చేజర్లలో వన్యప్రాణులను వేటాడే ముగ్గురిని ఆదూరుపల్లి ఫారెస్ట్ అధికారులు అరెస్టు చేశారు. కండలేరు డ్యామ్ సమీపంలో అనుమానంగా సంచరిస్తున్న వీరిని అదుపులోకి తీసుకున్నారు. అటవీశాఖ రేంజ్ అధికారి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ వంశీకృష్ణ, సిబ్బందితో కలిసి నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు.
నిందితులు సూరిపాక ప్రసన్న కుమార్, కుడుముల వెంకటేశ్వర్లు, పాలపర్తి భాస్కర్‌పై వన్యప్రాణుల చట్టం కింద కేసులు నమోదు చేయనున్నట్లు అటవీ శాఖ అధికారి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. నిందితులను పట్టుకున్న డీఆర్వో వంశీకృష్ణ సిబ్బందిని ఆయన అభినందించారు. వారి వద్ద నుంచి జింక చర్మాన్ని, నాటు తుపాకీ, కత్తులను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: