ETV Bharat / state

మా బకాయిలు చెల్లించండి: ఇసుక కూలీలు - నెల్లూరులో బకాయిలు చెల్లించలేదని ఇసుక కూలీల ధర్నా

నెల్లూరు జిల్లా ఇసుక రీచ్​లో రెండు నెలలుగా కూలీ బకాయిలు చెల్లించలేదని కూలీలు ఆందోళనలు చేశారు. రీచ్​లో పనులు జరగకుండా రోడ్డుకు గండి కొట్టి పనులను అడ్డకున్నారు.

nellore sand labours dharna for not giving their dues
రోడ్డును తవ్వి పనులను అడ్డుకున్న కూలీలు
author img

By

Published : Dec 2, 2019, 3:13 PM IST

నెల్లూరులో బకాయిలు చెల్లించలేదని ఇసుక కూలీల ధర్నా

నెల్లూరు జిల్లా అనంతసాగరం పడమటికంభంపాడు ఇసుక రీచ్​లో పనులు చేసిన కూలీలకు...గుత్తేదారులు వేతనం చెల్లించకపోవడంతో రెండు రోజులుగా ఆందోళనలు చేపడుతున్నారు. రెండునెలలకు పైగా పనులు చేయించుకుని... గుత్తేదారు కూలీ చెల్లించలేదని పనులను అడ్డుకున్నారు. రీచ్ వద్ద ఇసుక లారీలు తిరగకుండా రోడ్డుకు గండి కొట్టారు. బకాయిలు చెల్లించేవరకు నిరసనలు తెలుపుతామని. పనులను అడ్డగిస్తామని కూలీలు హెచ్చరిస్తున్నారు.
సోమశిల, పడమటికంభంపాడు గ్రామాలకు చెందిన 500మంది కూలీలు ఇసుక రీచ్​లో పనిచేశారు. వీరికి సుమారు రూ.25లక్షల బకాయిలు చెల్లించాల్సి ఉంది. రోజూ కూలీ పనులు చేస్తే కాని కడుపునిండదని, తమ శ్రమ దోచుకున్నారని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పడమటికంభంపాడు రీచ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఐదు ఇసుక లారీలను పోలీసులు పట్టుకున్నారు.

ఇదీ చదవండి: నెల్లూరు జిల్లాలో భారీ వర్షం... స్వర్ణముఖి నదికి జల కళ

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.