ETV Bharat / state

'2021-22 ఏడాది ఆస్తి పన్ను ఈ నెలలోనే చెల్లిస్తే 5 శాతం రాయితీ'

2021 - 22 ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన ఆస్తి పన్నును ఏప్రిల్ నెలలోనే చెల్లిస్తే 5 శాతం రాయితీ కల్పిస్తామని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. కార్పొరేషన్​ పరిధిలో 2020-21లో రూ. 55.11 కోట్ల వసూలు చేసి రాష్ట్రస్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచినట్లు ఆయన తెలిపారు.

Nellore Municipal Corporation Commissioner Dinesh Kumar
నెల్లూరు నగరపాలక సంస్థ
author img

By

Published : Apr 4, 2021, 6:03 PM IST

పన్నుల వసూలులో రాష్ట్రంలోనే నెల్లూరు నగర పాలక సంస్థ ఉత్తమ పనితీరు కనబర్చినట్లు కార్పొరేషన్ కమిషనర్ దినేష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 55.11 కోట్ల ఆస్థి పన్నులు వసూలు చేసినట్లు చెప్పారు.

గత ఏడాది రూ. 33.35 కోట్ల పన్ను వసూలు చేయగా.. ఈ ఆర్థిక ఏడాదిలో రూ. 21.76 కోట్లు అదనంగా వసూలైనట్లు చెప్పారు. ఈ విభాగంలో.. రాష్ట్రంలోనే 5వ స్థానం సాధించామన్నారు. అలాగే... 2021-22 ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన ఆస్తి పన్ను ఏప్రిల్ నెలలోనే చెల్లిస్తే 5 శాతం రాయితీ కల్పిస్తామని చెప్పారు.

ఇదీ చూడండి:

అర్చకుల హక్కులను జగన్ పరిరక్షిస్తున్నారు: రమణ దీక్షితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.