నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం తెదేపా ఇంఛార్జిగా నెలవల సుబ్రహ్మణ్యంను నియమించారు. ఈ సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేశారు. పార్టీ నేతలు ఆయన్ని అభినందించారు. చంద్రబాబు తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపతం చేయటం తన ప్రథమ కర్తవ్యమని ఆయన అన్నారు. నాయకులను, కార్యకర్తలను సమన్వయపరుస్తూ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. తెదేపా హయాంలో జరిగిన అభివృద్ధి నేటికీ కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఒక్క పని కూడా జరగలేదని విమర్శించారు.
ఇదీ చదవండి: 'వర్శిటీ ఈసీ సభ్యుల భర్తీకి విధివిధానాలేంటో చెప్పండి'