ETV Bharat / state

ఎమ్మెల్యే ఆనంకు వైసీపీ షాక్​.. వెంకటగిరి ఇన్‌ఛార్జ్‌గా నేదురుమల్లి రామకుమార్​రెడ్డి - venkatagiri ycp new incharge

ramkumar with cm jagan
ramkumar with cm jagan
author img

By

Published : Jan 3, 2023, 7:54 PM IST

Updated : Jan 3, 2023, 10:45 PM IST

19:48 January 03

ఆనం రామనారాయణరెడ్డిపై వైకాపా క్రమశిక్షణా చర్యలు

నెల్లూరు జిల్లాలో కీలక నేత.. మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిపై పార్టీ అధిష్ఠానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఇటీవల బహిరంగ వేదికలపై వరుసగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకుంది. ఆనం వ్యాఖ్యలు, ఆయన వ్యవహారంపై సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిపింది. ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలను పిలిచి ఆనం వ్యవహారంపై చర్చించారు. కొంతకాలంగా ఆనం విమర్శలు చేస్తున్నా.. వేచి చూసే ధోరణిలో ఉన్న వైసీపీ అధిష్ఠానం.. రెండు, మూడ్రోజులుగా బహిరంగ వేదికలపై నుంచే ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తుండటంతో ఇకపై ఉపేక్షించకూడదని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.

వెంకటగిరి ఇన్‌ఛార్జిగా రామ్‌కుమార్‌రెడ్డి..: ఈ నేపథ్యంలో ఆనం రామనారాయణరెడ్డిపై చర్యలు తీసుకోవాలని పార్టీ ముఖ్యనేతలకు సీఎం ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. సీఎం ఆదేశాల మేరకు వైసీపీ అధిష్ఠానం ఆనంపై చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి ఎమ్మెల్యే ఆనంను తొలగించారు. వెంకటగిరి ఇన్‌ఛార్జిగా మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి కుమారుడు రామ్‌కుమార్‌రెడ్డిని ప్రకటించారు. ఇన్‌ఛార్జిల మార్పుపై వైకాపా కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇన్‌ఛార్జిగా తొలగించడం ద్వారా నెల్లూరు జిల్లాలో ఆనం రామనారాయణరెడ్డి ప్రాధాన్యతను తగ్గించేలా చర్యలు తీసుకుంది. ఇకపై విమర్శలు చేయకుండా కట్టడి చేయాలని భావిస్తోంది. వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి రామ్‌కుమార్‌రెడ్డి ఆదేశాలను పాటించాలని స్థానిక అధికారులకు పార్టీ ముఖ్యనేతలు ఆదేశించినట్టు సమాచారం.

బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ వైకాపా ఇన్​ఛార్జిగా ఆమంచి కృష్ణమోహన్​ను నియమించారు. ఈ మేరకు వైకాపా కేంద్ర కార్యాలయం నుండి ఒక లేఖను విడుదల చేసారు. రెండు సార్లు చీరాల ఎమ్మెల్యేగా చేసిన ఆమంచి కృష్ణమోహన్ గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. చీరాలలో తెలుగుదేశం పార్టీనుండి గెలుపొందిన కరణం బలరామకృష్ణమూర్తి వైకాపాకు మద్దతు పలకటంతో.. ఆమంచి కొంతకాలంగా స్తబ్దతగా ఉన్నారు.. ఈనేపథ్యంలో వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పర్చూరు నియోజకవర్గ ఇన్​చార్జ్​గా ఉన్న రావి రామనాధం బాబును పక్కనపెట్టి.. అమంచికి పర్చూరు నియోజకవర్గ పగ్గాలను అందించారు. దీంతో పర్చూరు, మార్టూరు, ఇంకొల్లు, చినగంజాం ప్రాంతాల్లో ఆమంచి అభిమానులు బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు.

Last Updated : Jan 3, 2023, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.